18 July, 2026 | 8:43 PM

Breaking News

మహంకాళి ఆలయంలో డిసిసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రత్యేక పూజలు   •   సిద్ధార్థలో స్కూల్ లీడర్స్ ప్రమాణ స్వీకారోత్సవం   •   గ్రామాలకు వెళ్లి ఎల్ నినో పరిస్థితులపై అవగాహన కల్పించాలి   •   గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం   •   ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి   •   ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •  

నాయకత్వం అంటే పదవి కాదు.. బాధ్యత

18-07-2026 07:54 PM

- సెయింట్ మేరీస్ విద్యానికేతలో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారం

గజ్వేల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ మేరీస్ విద్యానికేత హైస్కూల్‌లో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గజ్వేల్ సీఐలు రవికుమార్, సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాయకత్వం అంటే బ్యాడ్జి ధరించడం కాదని, అది ఒక బాధ్యత అని అన్నారు.

విద్యార్థి నాయకులు క్రమశిక్షణతో వ్యవహరిస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి మాట్లాడుతూ, నాయకత్వ పదవి గౌరవంతో పాటు బాధ్యత కూడా అని, పాఠశాలను ప్లాస్టిక్ నిషేధిత పాఠశాలగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ థామస్ రెడ్డి, ప్రిన్సిపాల్ కాటరాయప్ప పాల్గొన్నారు. విద్యార్థి నాయకులుగా ఎన్నికైన వారు బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తామని ప్రమాణం చేశారు.