16 May, 2026 | 2:09 AM

మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్

16-05-2026 12:15 AM

బాన్సువాడ, మే 15 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణలోనీ  మళి దశ ఉద్యమకారులను పోలీసులు శుక్రవారం ముందస్తూ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి కార్యక్రమానికి ఉద్యమకారుల సంఘాలు కలసి పిలుపు ఇవ్వడంతో ముందస్తుగా ఎలాంటి అవంచనియా సంఘటనలు జరగకుండా ఉద్యమకారులను అదుపులో తీసుకోవడం జరిగింది.

ఉద్యమకారులు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ కొరకు పోరాటాలు చేసిన ఉద్యమకారులను ఆదుకొంటామని కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరంలు గడుస్తున్న ఇప్పటి వరకు కూడ ఉద్యమకారుల ఆశయాలను ప్రభుత్వం పట్టిoచు కొనందున ఉద్యమకారులు ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి పిలుపు ఇవ్వడంతో అల్లర్ట్ అయిన పోలీస్ సిబ్బంది జాగ్రత్త పడడం జరిగింది కానీ ఉద్యమకారులు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను జూన్ 2 వరకైనా ప్రకటించక పొతే తదుపరి కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వంనకు ఉద్యమకారులు హెచ్చరిక చేసారు.

ఈ అరెస్టులో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్ గుప్త మండల అధ్యక్షులు గంజివార్ చందు. కాల్వ శ్యామ్.భాస్కర్ గౌడ్.ఎదుబాల్లే కృష్ణ.అగ్లవే దత్తు.గైని గంగారామ్. పల్లికొండ సాయి కుమార్ పాల్గొన్నారు.