పీఆర్సీ, డీఏలు విడుదల చేయాలి... సీపీఎస్ రద్దు చేయాలి
27-08-2026 03:01 PM
కలెక్టరేట్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్నా
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీ జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, ఆరు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి, ఉద్యోగుల హెల్త్‌కార్డ్ స్కీమ్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. 317 జీవో బాధితులకు పెండింగ్‌లో ఉన్న డిప్యూటేషన్లు మంజూరు చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.






