సర్ నోటీసు వస్తే ఓటు సరి చేసుకోండి
ముకరంపుర, ఆగస్టు 27(విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలోని రేకుర్తి 19వ డివిజన్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ వార్డు సభలో పాల్గొని ఎస్ఐఆర్ నోటీసులు తీసుకున్న వారి సందేహాలు మరియు కొత్త ఓటర్లకు సంబంధించినటువంటి సందేహాలకు సమాచారం అందించారు.19వ డివిజన్ కార్పోరేటర్ సుధగోని.
మాధవి-కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. డివిజన్ ప్రజలు అందరూ కూడా మీది కానీ మీ కుటుంబ సభ్యుల ఎస్ఐఆర్ పత్రాలలో ఏమైనా తప్పులు ఉన్నచో సరి చేసుకోవడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కావున ప్రజలు అందరూ బిఎల్ఓ దగ్గర ఉన్నటువంటి నోటీసులను తీసుకోని సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని కోరారు .ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ పర్వతం మల్లేశం మాజీ కార్పోరేటర్ ఏదుల్ల.రాజశేఖర్ జిపిఓ ఆంజనేయులు ప్రసాద్ మరియు బిఎల్వో లు డివిజన్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.






