14 July, 2026 | 6:54 PM

Breaking News

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •  

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి

16-02-2026 08:00 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ ఎన్.రవిలు వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు 89 అర్జీలను అందజేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను సంబంధిత శాఖల అధికారులు, తహసిల్దార్లను తక్షణమే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని  కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్,  హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, డిఆర్డిఓ మేన శ్రీను, సిపిఓ సత్యనారాయణరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.