24 August, 2026 | 9:51 PM

కడ్పల్ ZPHS పాఠశాలలో కాంప్లెస్ సమావేశం

24-08-2026 07:54 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంఈవో నాగారం శ్రీనివాస్ మాట్లాడుతూ... పాఠశాలలో  చేరిన 2 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు ఉన్న ప్రతి  విద్యార్థి FLN సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలని, అందుకు అనుగుణంగా తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్ట్ లలో చదవడం, రాయడం, గణితంలో కూడిక, తీసివేసి, గుణకారం, భాగహారం వంటి చతుర్విద ప్రక్రియలు అందరూ సాధించేలా చూడాలని అన్నారు. అందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తగిన శ్రద్ద వహించాలని, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ పెంచి FLN బోధన విధానం అమలు విధానం చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగేలా అందరూ కృషి చేయాలని ఎంఈవో నాగారం శ్రీనివాస్ అన్నారు.