24 August, 2026 | 9:43 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •   ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం   •   చిలుకూరును డైరీ హబ్ గా తీర్చిదిద్దాలి   •   గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది   •   ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి   •   డ్రైవర్ కుటుంబానికి తోటి డ్రైవర్ల ఆర్థిక చేయూత   •   విద్యార్థులు కమ్యూనికేషన్, ఏఐ స్కిల్స్ పెంపొందించుకోవాలి   •   డీజిల్‌ దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్‌   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, జీపీఓ   •   మిలాద్ ఉన్ నబి కమిటీ సభ్యులతో పోలీసు కమిషనర్ సమావేశం   •  

దమ్మాయిగూడ నాగారం రోడ్డు పనులు త్వరగా ప్రారంభించాలి

24-08-2026 08:08 PM

80 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేయాలి

ఎంపీ  ఈటల కు వినతి పత్రం

జవహర్ నగర్,(విజయక్రాంతి): దమ్మాయిగూడ–నాగారం ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మెయిన్ రోడ్ ప్లాట్స్ అసోసియేషన్ సభ్యులు మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్‌ను సోమవారం ఉదయం ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.ప్రస్తుతం ప్రతిపాదిత 100 అడుగుల రోడ్డును 80 అడుగులకు పరిమితం చేసి రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని వారు ఎంపీని కోరారు.

రహదారి పనులు ఆలస్యం కావడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏనుగు సంజీవరెడ్డి, రామారం వెంకటేష్ గౌడ్, బాల్ రెడ్డి, వసుపతి నవీన్ గౌడ్, ఎల్లారెడ్డి , కృష్ణ, ఇమామ్ , సుబ్రహ్మణ్యం, నేమిచంద్ పవార్, గణేష్, పలువురు పాల్గొన్నారు.