28 July, 2026 | 2:33 AM

ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

28-07-2026 12:00 AM

కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, జులై 27 (విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీ లించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్య లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి స్వయంగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో మొత్తం 71 దరఖాస్తులు అం దాయని, వాటిని సంబంధిత శాఖల అధికారులకు తగు చర్యల కోసం పంపినట్లు తెలి పారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా బాధితు లకు న్యాయం జరిగేలా అర్జీలను పరిష్కరించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఆర్‌ఓ వసంత కుమారి, భూపాలపల్లి ఆర్డీవో హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన జిల్లా నూతన ఎల్‌డీఎం నాగరాజు 

భూపాలపల్లి,జులై 27 (విజయ క్రాంతి): జిల్లా నూతన లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డిఎం) గా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు సోమవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలె క్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగరాజు కలెక్టర్కు మొక్కను అందజేశారు.గతంలో ఎల్డి ఎంగా విధులు నిర్వహించిన తిరుపతి హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో నాగరాజును నియమించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పో షిస్తుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి బ్యాం కర్ల సమన్వయ కమిటీ సమావేశాల్లో నిర్ణయించిన లక్ష్యాలను సాధించేందుకు సమ న్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, స్వయం ఉపాధి, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారాలకు రు ణాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

ప్రభుత్వ పథకాల అమలులో బ్యాం కులు సమర్థవంతంగా భాగస్వామ్యం కావాలని, లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో బ్యాంకింగ్ సేవలను మరింత బలోపేతం చేసి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.