సుల్తానాబాద్ మున్సిపాలిటీ ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
సుల్తానాబాద్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ(Sulthanabad Municipality)నీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు, శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు, అనంతరం నిర్వహించిన ర్యాలీ నీ బిరుదు కృష్ణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా నేటి నుండి 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో వార్డుల వారిగా పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైల్స్ పూర్తి చేయడం, సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా నీటి ఎద్దడి సమస్యలు పరిష్కరించుట, అమృత్ పైప్ లైన్లు పూర్తి చేయుట, చెరువులలో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించుట, పబ్లిక్ టాయిలెట్లను శుభ్రపరచుట, ఇంటి పన్నుల వసూలు తో పాటు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాల ను పాలకవర్గం, సిబ్బందిచే అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. ఇందులో మున్సిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, కమిషనర్ రమేష్, కౌన్సిలర్లు, మహిళా సంఘాల మహిళలు, విద్యార్థులు, మునిసిపల్ సిబ్బంది, పలువురు పాల్గొన్నారు,




