30 June, 2026 | 8:39 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు

04-05-2026 11:19 AM

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం (మే 4) నుంచి 9వ తేదీ వరకు ‘రైతు వారం’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి (AO) సీతారాం రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం 9 గంటలకు మండలంలోని తిరుమలాయపాలెం, గోపాలపురం, దమ్మాయిగూడెం, బీరోల్, రాజారాం, కాకరవాయి, హస్నాబాద్, పాతర్లపాడు క్లస్టర్ల రైతు వేదికల వద్ద ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.

ఈ సదస్సుల్లో నేల ఆరోగ్య పరిరక్షణ, భూసార పరీక్షలు, సమతుల్య ఎరువుల వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయం పద్ధతులు, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సన్న వరి రకాల సాగుపై నిపుణులు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు మండలంలోని ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, రైతులు, అనుబంధ శాఖల అధికారులు భారీగా హాజరై విజయవంతం చేయాలని వ్యవసాయ అధికారి కోరారు. రైతులు తమ వ్యవసాయానికి సంబంధించిన సందేహాలను నేరుగా అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు.