7 July, 2026 | 3:52 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

నిరుపేదల నిలువ నీడ కోసం ఇందిరమ్మ ఇల్లు

03-05-2026 01:31 PM

కేసముద్రం,(విజయక్రాంతి): నిలువ నీడలేని నిరుపేదలకు మెరుగైన నివాసగృహ వసతి కల్పించాలని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన నిలువ నీడలేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ బానోతు సునీత, వైస్ చైర్పర్సన్ డాక్టర్ అల్లం రమ స్పష్టం చేశారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో 8 వార్డుకి చెందిన ఎస్.కె తహేర కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చేందుకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నామని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణం చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని, బిల్లులు సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వేముల భారతి, కనుకల సుభద్ర పాల్గొన్నారు.