30 June, 2026 | 2:31 AM

రెండున్నరేళ్లలో 80వేల ఉద్యోగాలిచ్చాం

30-06-2026 01:46 AM

మరోసారి తప్పక రేవంత్ సీఎం

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలలో ఆర్థిక విధ్వంసం

ప్రజల దీవెనతో సభ విజయవంతం

నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత

నల్లగొండ టౌన్, జూన్ 29: రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ ప్రజాపాలనలో 80వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆకాంక్షను నెరవేర్చామని, ఇంకా ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి కార్యచరణ చేపట్టారని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాస్ నేత అన్నారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆదివారం నల్గొండలో నిర్వహించిన ప్రజా దీవెన సభ విజయవంతమైందని సభకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉండేందుకు జనం ఆశేషంగా తరలివ చ్చారని, ఈ సహకారంతోనే 2034లో మరోసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అందుకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహకారం ఉంటుంద న్నారు. పదేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని, నిధులు నీళ్లు నియామకల్లో తీరని అన్యాయం జరిగిందని, అన్ని కెసిఆర్ కుటుంబానికి ప్రయోజన కరంగా మారిందన్నారు.

ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసిఆర్ కి దక్కిందన్నారు.ఎస్ ఎల్ బి సి సొరంగం, డిండి సాగర్ కాలుల ఆధునికరణ,ఎమ్మార్పీ ఆధునీకరణ పూర్తి చేస్తామని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల్లోపు సాగునీరు ఇ స్తామని సీఎం చెప్పడం హర్షినియమ న్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, వడ్డీ వడ్డీ లేని రుణాలు ఇస్తూ భరోసా కలిగిస్తున్నట్లు తెలిపారు.

పది సంవత్సరాలుగా కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లాకు చేకూరిన ప్రయోజనం శూన్యమని, రెండున్నర సంవత్సరాల పాలనలో వేల కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రిది అన్నారు. ఎస్ ఎల్ బి సి టన్నెల్,నెల్లికల్, కిష్ట రాంపల్లి రిజర్వాయర్, బ్రాహ్మణ వెల్లంల,చర్లగూడెం రిజర్వాయర్, లను పూర్తి చేయకుండా నల్గొండ రైతులను వంచించిన బిఆర్‌ఎస్ నేడు ముసలి కన్నీరు కార్చడం విడ్డూరం అన్నారు.

ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను రాజు చేస్తామని సీఎం హామీ ఇవ్వడం సీఎంకు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్, బిజెపి లకు ప్రజలు ఓటు ఎందుకు వేయాలో చెప్పలేక పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్,ఎండి ముంతాజ్ అలీ, మేకల రాజేందర్ రెడ్డి,దామనూరి అశోక్, చర్లపల్లి గౌతం, పగిళ్ల రాజు, వేముల గోపీనాథ్, వెంకటరత్నం, గుర్రం కోటేష్, ఎండి అజీస్, సయ్యద్ నాగుల్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.