17 April, 2026 | 3:46 AM

పవర్ పేట రాజకీయాలు!

17-04-2026 12:00 AM

హీరో సందీప్ కిషన్ చిత్ర పరిశ్రమలో 16 ఏళ్లు పూర్తి చేసుకుని ఒక మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొత్త సినిమాను ప్రకటించారు. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. రచయిత, -దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ‘పవర్ పేట’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ విషయాన్ని టీమ్ అధికారిక ప్రకటిస్తూ, విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. డైరెక్టర్ కృష్ణ చైతన్య విభిన్న జానర్లను కలిపి రూపొందించిన ఈ శక్తిమంతమైన కథలో సందీప్ కిషన్ తన కెరీర్‌లోనే అత్యంత బలమైన పాత్రలో కనిపించనున్నారు. భావోద్వేగాలు, పవర్ రాజకీయాల మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ అని టీమ్ పేర్కొంటోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని మణిశర్మ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను మదీ నిర్వహిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతను నిర్వర్తిస్తారు.