27 July, 2026 | 3:23 PM

వేంసూరులో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

27-07-2026 02:40 PM

రైతులు, పశువులు, గొర్రెల కాపరులకు ప్రాణహాని ముప్పు ఉందని ఆందోళన.

ఫిర్యాదుపై స్పందించిన వేంసూరు ఏఈ.. త్వరలో సమస్య పరిష్కరిస్తామని హామీ.

వేంసూరు. జూలై 27,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని విద్యుత్ తీగలు(Electric wires) అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం, వేంసూరు నుంచి రాయుడుపాలెం వెళ్లే ఆర్‌అండ్‌బీ బీటీ రోడ్డులో గృహాలకు వెళ్లే విద్యుత్ తీగలు చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్నాయి. దీంతో రైతులు, పశువులు, గొర్రెల కాపరులకు ప్రాణహాని ముప్పు పొంచి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే సమస్యను పరిష్కరించాలని కోరుతూ విజయక్రాంతి ప్రతినిధి వేంసూరు ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్)కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీనిపై వెంటనే స్పందించిన ఏఈ, సమస్యను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్థానికులు కూడా విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.