31 August, 2026 | 9:18 PM

భీమారంలో ఐపీఎంపై క్షేత్ర ప్రదర్శన

31-08-2026 08:14 PM

భీమారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో మంచిర్యాల జిల్లా వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ - ATMA) ఆధ్వర్యంలో ప్రధాన పంటలలో సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతుల (IPM)పై క్షేత్ర ప్రదర్శన, రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమారం మండల వ్యవసాయ అధికారి (MAO) అత్తే సుధాకర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. పంటల్లో ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణకు రసాయన మందుల వాడకాన్ని తగ్గించి, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించడం వల్ల సాగు ఖర్చు తగ్గి అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు. ముఖ్యంగా చేనులో పక్షి తావడాలు (Bird Perches) ఏర్పాటు చేయడం ద్వారా మిత్ర పురుగులు, పక్షులు రసం పీల్చే పురుగులను, లార్వాలను సహజసిద్ధంగా తిని తెగుళ్ల ఉధృతిని తగ్గిస్తాయని తెలిపారు, ఈ కార్యక్రమంలో బి.టి.ఎం (BTM), పరిసర ప్రాంతాల రైతులు పాల్గొని క్షేత్ర ప్రదర్శనను పరిశీలించారు.