31 August, 2026 | 8:54 PM

బాచ్పన్‌లో ఉత్సాహభరితంగా స్పోర్ట్స్ డే వేడుకలు

31-08-2026 08:19 PM

అమీన్ పూర్: బాచ్పన్ అకాడెమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్లో స్పోర్ట్స్ డే వేడుకలు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, క్రీడా స్ఫూర్తితో సోమవారం నిర్వహించారు. విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే నైపుణ్యం, పట్టుదల వంటి విలువలను పెంపొందించడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశ్యం. వేడుకల్లో భాగంగా వివిధ క్రీడా ప్రముఖుల విజయాలు  విశిష్టమైన క్రీడా ప్రస్థానాన్ని పరిచయం చేస్తూ ప్రత్యేక సభ నిర్వహించారు. ప్రముఖ క్రీడాకారుల అంకితభావం, కృషి  విజయాలు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చాయి. వివిధ క్రీడలను ప్రతిబింబించేలా విద్యార్థులు విభిన్న క్రీడా దుస్తుల్లో హాజరై సందడి చేశారు.

క్లాస్-I విద్యార్థుల అద్భుతమైన నృత్య ప్రదర్శన వేడుకలకు మరింత ఉత్సాహాన్ని జోడించింది. అనంతరం నిర్వహించిన వివిధ ఆటలు, క్రీడా కార్యక్రమాల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ చురుకుదనం, సమన్వయం, జట్టుస్ఫూర్తి, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల  డైరెక్టర్లు సి.హెచ్. శ్రీనివాసరావు,  ఆర్.శిరిషారెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీమతి లక్ష్మీ రాఘవేంద్ర  హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ స్పోర్ట్స్ డే వేడుకలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, జట్టుస్ఫూర్తి ఆరోగ్యకరమైన జీవనశైలి పట్ల అవగాహనను పెంపొందిస్తూ, అందరికీ ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచాయి.