24 గంటల విద్యుత్ కోసం రైతుల ధర్నా
31-08-2026 08:31 PM
గట్టు: వ్యవసాయానికి 24 గంటల నిరంతర త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గద్వాల జిల్లా గట్టు మండల రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రోజుకు 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుండగా, తరచూ కోతలతో పంటలకు నీరందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం ధర్నాకు అనుమతి కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 24 గంటల వ్యవసాయ విద్యుత్‌ను పునరుద్ధరించాలని రైతులు డిమాండ్ చేశారు.






