22 July, 2026 | 1:58 AM

సమస్యల పరిష్కారానికి పోస్ట్ కార్డు ఉద్యమం

22-07-2026 01:03 AM

కొండపాక, జులై 21: సమగ్ర శిక్ష ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాన్ని టీఎ స్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మంగళవారం కొం డపాక మండలం దుద్దెడ జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పెట్ల యాదగిరి మాట్లాడుతూ కేజీబీవీ, యుఆర్‌ఎస్, సమగ్ర శిక్షలు పనిచేస్తున్న టీచర్లు, వర్క ర్ ల శ్రమ దోపిడి దశాబ్దాలుగా గురవుతున్నారని, ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ మిని మం టైం స్కేల్ వర్తింపచేయాలని, సర్వీస్ రె గ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రె గ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవు లు, వార్షిక ఇంక్రిమెంట్లు, వర్తింపచేసి, హెల్త్ కార్డులు అందజేయాలని అన్నారు.

కేజీబీవి, యు ఆర్ ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కేర్ టీచర్లను నియమించి రా త్రి విధులనుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ పాల్గొనా లని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టి ఎస్ యుటిఎఫ్ కొండపాక మండల అధ్యక్షులు ఎర్రోళ్ల శ్రీనివాస్, సమగ్ర శిక్ష రాష్ట్ర పూ ర్వ అధ్యక్షుడు ఎం సురేందర్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.