22 July, 2026 | 1:59 AM

సర్ ప్రక్రియను వేగవంతం చేయాలి

22-07-2026 01:04 AM

బూత్ లెవెల్ ఏజెంట్లతో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష

సంగారెడ్డి, జూలై 21 :రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఓటరు జా బితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంపై ఆందోల్ నియోజకవర్గంలోని ము నిపల్లి, రాయికోడ్, ఆందోల్, పుల్కల్ , చౌటకూర్, రేగోడ్, రాయికోడ్ , వట్పల్లి, అల్లాదుర్గ్ మండలాల బీఎల్‌ఏలు , మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో సంగారెడ్డిలోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ బూతు లెవెల్ ఏజెంట్స్ కు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు అవగాహన క ల్పించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయరాదని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో  బూతు లెవల్ ఏజెంట్లు ఎదుర్కున్న అనుభవాలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

బూతుల వారిగా ఎన్ని ఓట్లు నమోదు అయ్యాయి, నమోదు కాని ఓటర్లు వివరాలు వెంటనే సేకరించి వారి ఎన్యూమరేషన్ ఫారాలను అందించి ఓటరుగా నమోదుకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డాక్టర్స్ సెల్ చైర్మన్ డా.రాజీవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జోగిపేట మున్సిపాలిటీ చై ర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, ఆందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లోడి సతీష్, బాలాజీ నరసింహులు, దుర్గారెడ్డి, దశరథ్, రమేష్ జోషి , శివరాజ్, శేషారెడ్డి, దిగంబర్ రావు, రమేష్ లు, మాజీ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్స్ , ఇతర ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ లు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.