4 July, 2026 | 1:02 AM

ప్రీ క్వార్టర్స్‌లో పోర్చుగల్

04-07-2026 12:05 AM

రొనాల్డో అరుదైన రికార్డు

టొరంటో, జూలై 3 : ఫిఫా ప్రపంచకప్ లో పోర్చుగల్ ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2-1 స్కోరుతో క్రొయేషియాపై విజ యం సాధించింది. 53వ నిమిషంలో క్రొయేషియా గోల్ సాధించగా.. తర్వాత 68, 94వ నిమిషాల్లో పోర్చుగల్ గోల్స్ చేసి ఆధిక్యం లో నిలిచింది. చివర్లో క్రొయేషియా గోల్ కొట్టినా రిఫరీ దానిని ఆఫ్ సైడ్‌గా ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో గోల్ కొట్టిన అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. రొనాల్డో 41 ఏళ్ల 147 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.