1 September, 2026 | 6:26 PM

పేద ప్రజలు సీఎంఆర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్

01-07-2026 | 01:46pm

బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వ పరంగా అందుతున్న సీఎంఆర్ పథకాన్ని అర్హులైన పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కోరారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని 67 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రవేశపెట్టాలని పథకం పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అవసరమైన సంక్షేమ పథకాలు అందించేందుకు తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ప్రజల కష్టసుఖాల లో అండగా ఉంటానని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.