1 September, 2026 | 7:17 PM

ప్రకృతి వ్యవసాయంతో నేలకు బలం

01-09-2026 | 06:06pm

- మండల వ్యవసాయాధికారి అత్తె సుధాకర్

భీమారం,(విజయక్రాంతి): ప్రకృతి వ్యవసాయం(Natural farming) చేయడం ద్వారా నేల సారం పెరగడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గి రైతులకు నాణ్యమైన, దిగుబడులు లభిస్తాయని భీమారం మండల వ్యవసాయాధికారి అత్తె సుధాకర్(Bhimaram Mandal Agriculture Officer Atte Sudhakar) అన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ - ATMA) ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం (Natural Farming) - RPL ఆధారిత నైపుణ్యాభివృద్ధిపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి (MAO) మాట్లాడారు.

రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమికి చేకూరే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ (BTM) విశ్వేశ్వర్నాథ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.