1 September, 2026 | 7:18 PM

సర్వే ఆధారంగా వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

01-09-2026 | 06:15pm

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామం(Malthummeda Village)లో క్షేత్రస్థాయిలో సర్వేయర్లు నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వే(Digital Crop Survey) ప్రక్రియను వ్యవసాయ విస్తరణ అధికారి ప్రశాంత్ కుమార్ సందర్శించి సర్వేర్లకు పలు సూచనలు అందజేశారు. ఈ సందర్శనలో భాగంగా రైతులు సర్వేయర్లకు సహకరించి మీరు మీ సర్వే నెంబర్లు ఏ పంట, ఏరకము వేశారో సర్వేయర్లు వివరాలు తెలిపి సహకరించాలని రైతులకు సూచించారు.

అదేవిధంగా సర్వేయర్లకు ఈ డిజిటల్ సర్వేను ఖచ్చితత్వంతో చేయాలని సూచించడం జరిగింది. ఈ సర్వే ఆధారంగా రైతుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనీ సర్వేయర్కి  అదేవిధంగా రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ సర్వే అనేది సర్వేనెంబర్ వారీగా ఆన్లైన్ చేయడం జరుగుతుందని రైతులకు తెలిపారు. ఈ డిజిటల్ క్రాఫ్ట్ సర్వేకు సర్వేయర్గా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరిని నియమించడం జరుగుతుంది.