1 September, 2026 | 6:56 PM

సెల్ ఫోన్ వదలండి

01-09-2026 | 05:48pm

- స్కిల్స్ నేర్చుకోండి...

- కళాశాల వైస్ ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డి 

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): సెల్ ఫోన్ చూస్తూ కాలక్షేపం చేయడం మాని విద్యార్థులు స్కిల్స్ నేర్చుకోవాలని కళాశాల వైస్ ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డి(College Vice Principal Narender Reddy) కోరారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో(Government Degree College) ఫిజిక్స్, కంప్యూటర్ డిపార్టుమెంట్ల ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన సోహమ్ అకాడమీ (Soham Academy) సహకారంతో రోబోటిక్స్‌పై నిర్వహించిన ఒక రోజు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు.

రోబోటిక్స్‌లో ఆసక్తి ఉన్న స్కూల్ విద్యార్థులను ప్రేరేపించాలనుకునే కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం ఇది అని, ట్రైనింగ్ పొందిన విద్యార్థులు స్కూళ్లకు వెళ్లి చెప్పినందుకు స్టైపెండ్ రోజువారీగా ఇవ్వబడుతుందన్నారు. రోబోటిక్స్ శిక్షణను(Robotics training) సద్వినియోగం చేసుకుంటే పాఠశాలల్లో వర్క్‌షాప్‌లు & ఇన్నోవేషన్ మేళాల్లో పాల్గొనే అవకాశం కలుగుతుందని, స్టైపెండ్ తో పాటు ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ లభిస్తుందన్నారు. అంతే కాకుండా బోధన, మార్గదర్శక అనుభవం వస్తుందన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.