1 September, 2026 | 6:56 PM

ఇంద్రా నగర్ గ్రామ సభలో పాల్గొన్న అదనపు కలెక్టర్ డాక్టర్ కే. కిరణ్మయి

01-09-2026 | 06:01pm

షాద్‌నగర్,(విజయక్రాంతి): ఇంద్రా నగర్ గ్రామ పంచాయతీ(Indra Nagar Gram Panchayat)లో మంగళవారం  నిర్వహించిన గ్రామ సభలో జిల్లా అదనపు కలెక్టర్  డాక్టర్ కే. కిరణ్మయి(Additional Collector Dr. K.Kiranmayi) పాల్గొన్నారు. గ్రామ సభలో చర్చించిన గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలను ఆమె సమీక్షించారు.

గ్రామ సభలో వచ్చిన సమస్యలు, అభ్యర్థనలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, పారదర్శకంగా మరియు నిర్దేశిత గడువులోగా అమలు చేయాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ కేంద్రాలను  పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కే. కిరణ్మయి

రంగారెడ్డి జిల్లా(Rangareddy District) చౌదరిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్  డాక్టర్ కే. కిరణ్మయ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, విద్యార్థుల హాజరు, అభ్యసన స్థాయిలు, మౌలిక వసతులు తదితర అంశాలను ఆమె పరిశీలించారు.

విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా ప్రగతి, అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు చేపడుతున్న చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రీ-ప్రైమరీ కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్ చిన్నారులకు అందిస్తున్న బోధన, ఆటలు, అభ్యసన కార్యకలాపాలు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.