శిరీష హత్యపై పారదర్శక విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష విధించాలి
01-09-2026 | 05:56pm
షాద్‌నగర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా
షాద్ నగర్,(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 21 ఏళ్ల ఆదివాసీ యువతి వి.కె. శిరీష దారుణ అత్యాచారం, హత్యకు గురైన ఘటనపై ఎస్‌ఎఫ్‌ఐ షాద్‌నగర్ డివిజన్ కమిటీ(SFI Shadnagar Division Committee) తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత చదువులు చదువుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలవాలనే ఆశయంతో నగరానికి వచ్చిన గిరిజన యువతికి(Tribal girl) ఇలాంటి దారుణం జరగడం అత్యంత బాధాకరమని ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి వడ్ల శ్రీకాంత్(SFI Division Secretary Vadla Srikanth) అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ టౌన్ ఉపాధ్యక్షులు అదిల్, చరణ్, వంశీ, రామ్‌చరణ్, విష్ణువర్ధన్, నబీతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.






