1 September, 2026 | 7:17 PM

ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు

01-09-2026 | 06:25pm

- వెయ్యి రోజాల కాంగ్రెస్ పాలన అద్భుతం 

- మాజీ ఎంపీ సోయం బాపూరావు

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ ప్రజాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) బాటలు వేస్తుందని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు అన్నారు. మంగళ వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల్లో అద్భుతంగా పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం పథకాలతో ముందుకు సాగుతుందన్నారు. గత పదేండ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు.

ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల్లో 72 వేలకు పైగా నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు(Ration cards) అందజేసిందన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తూ పేదల ఇంట్లో వెలుగులు నింపుతున్నారన్నారు. గరీబోళ్ళు కూడా సన్న బియ్యం తినాలానే ఉద్దేశంతో అర్హులందరికీ ఉచిత సన్నభియ్యం అందిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్టంలో లేని విధంగా మహిళలకు ఉచిత బస్సు అందిస్తూ పెద్దన్నలా ఆదుకుంటుందన్నారు. 12 వందలున్న గ్యాస్ సిలెండర్ ను సబ్సిడీపై ఐదు వందలకే అందిస్తుందన్నారు. ఇప్పటి వరకు 4. 50 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి చరిత్ర సృష్టించిందన్నారు.

ఏక కాలంలో 25 లక్షల రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్నారు. BRS, బీజేపీ పార్టీలు ఎన్ని అబద్దపు మాటలు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఇంకో రెండు సార్లు (10 యేండ్ల పాటు) ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉండడం ఖాయమన్నారు. ఈ మీడియా సమావేశంలో బోథ్ ఇంచార్జ్ ఆడే గజేందర్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ డిసిసిబి చైర్మెన్ అడ్డి భోజా రెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చేర్మెన్ సంజీవ్ రెడ్డి,మాజీ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, మాజీ జెడ్పిటిసి గణేష్ రెడ్డి, ఎస్సి సెల్ చెర్మన్ పరమేశ్వర్, మునిగేల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.