calender_icon.png 10 February, 2026 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

చేర్యాల పురపాలక సంఘం ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

10-02-2026 02:52:25 PM

చేర్యాల: చేర్యాల పురపాలక సంఘం 12 వార్డులకు ఎన్నికలలు బుధవారం జరగనున్న క్రమంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.మున్సిపల్ లోని మొదటి వార్డుకు సంబంధించి కురుమవాడలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలలో 1,2 బూతులను, రెండవ వార్డ్ పెద్దమ్మ గడ్డ ప్రాథమిక పాఠశాలలో, 3,4 బూతులను, మూడవ వార్డు పెద్దమ్మ గడ్డ ప్రొథ మిక పాఠశాలలో 5,6 బూతులను, నాలుగవ వార్డు పెద్దమ్మ గడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7,8 బూతులను ఐదవ వార్డ్ మంగలిగడ్డ వద్దగల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 9,10 బూతులను

ఆరవ వార్డు మంగలిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో 11,12 బూతులను ఏడవ వార్డు యాదవనగర్ లోని ఉన్నత ప్రాథమిక పాఠశా లలో 13,14 భూతులను,8వ వార్డు కడవేరుగు రోడ్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు 15,16 బూతులను తొమ్మిదవ వార్డు కడవేరుకు రోడ్డులో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 17,18 బూతులను పదవ వార్డు మున్నూరు కాపు భవనం లోని అంగన్వాడీ సెంటర్లో 19,20 బూతులను 11వ వార్డు పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో 21,22 బూతులను 12వ వార్డు శివాలయం వీధిలోని వైశ్య భవన్లో 23వ బూతును, పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో 24వ బూతును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ విధంగా ప్రతి వార్డుకు సంబంధించి రెండు బూతుల చొప్పున ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.