బుదేరా మహిళా డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్
18-07-2026 09:19 PM
మునిపల్లి,(విజయక్రాంతి): మండలంలోని బుదేరా చౌరస్తాలో గల గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అకడమిక్ భవనం, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ తదితర వాటిని పరిశీలించారు. అంతకుముందు అధ్యాపకుల హాజరు పట్టికను పరిశీలించారు. తరగతిగదులు, కంప్యూటర్ , ఏఐ క్లాసెస్ జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రంగారావు, కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.






