కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణం ఆపాలి
18-07-2026 09:16 PM
- అఖిలపక్షం నేతల డిమాండ్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పట్టణంలోని సర్వే నెం. 367 ప్రభుత్వ భూమిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శనివారం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బోనాసి రాంచందర్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన నాయకులు, ఈ భూమి నిషేధిత ప్రభుత్వ జాబితాలో ఉందని పేర్కొన్నారు. భూమిని పేదలకు పంపిణీ చేయాలని, నిర్మాణాన్ని ఆపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఎస్పీ, బీజేపీ, ఎంఆర్‌పీఎస్, డీవైఎఫ్‌ఐ తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.






