18 July, 2026 | 8:39 PM

Breaking News

సిద్ధార్థలో స్కూల్ లీడర్స్ ప్రమాణ స్వీకారోత్సవం   •   గ్రామాలకు వెళ్లి ఎల్ నినో పరిస్థితులపై అవగాహన కల్పించాలి   •   గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం   •   ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి   •   ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •   పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!   •  

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

10-02-2026 04:28 PM

జిల్లా ఎస్పీ నితిక పంత్ 

కాగజ్ నగర్,(విజయక్రాంతి): రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తి నిబద్ధతతో క్రమశిక్షణగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ నితిక పంత్  ఆదేశించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ పట్టణంలోని బిఎంఎస్ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఎన్నికల విధులపై పోలీస్ సిబ్బందికి సమగ్ర బ్రీఫింగ్ ఇచ్చారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, సున్నిత పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 BNSS అమలులో ఉన్నందున నలుగురికి మించి గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.