18 July, 2026 | 10:17 PM

శ్రీ నేతాజీ హై స్కూల్‌లో ఘనంగా బోనాల వేడుకలు

18-07-2026 09:14 PM

గణపురం,(విజయక్రాంతి):  సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను మండలంలోని బస్వరాజుపల్లి  శ్రీ నేతాజీ హై స్కూల్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు పోతారాజుల వేషధారణలో నృత్యాలు చేసి అలరించారు. అనంతరం విద్యార్థులు బోనాల పండుగ విశిష్టతను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఉడుత సాంబయ్య యాదవ్ మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ ప్రజల భక్తి, సంస్కృతి, ఐక్యతకు ప్రతీక అని తెలిపారు. ఇటువంటి సాంప్రదాయ వేడుకలను పాఠశాలల్లో నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతి, ఆచారాల పట్ల గౌరవం, అవగాహన పెంపొందుతాయని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు బోనాల పండుగ చరిత్ర, విశిష్టతను వివరించారు.