14 August, 2026 | 3:00 AM

బీఆర్‌ఎస్ పాలనలోనే హత్యా రాజకీయాలు

14-08-2026 12:41 AM

డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల 13 ఆగస్టు(విజయక్రాంతి )కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు హత్యా రాజకీయాలకు తావు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీకి హత్యా రాజకీయాల సంస్కృతి లేదని జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు.వెంకటేష్ మరణాన్ని రాజకీయంగా మలిచి లబ్ధి పొందేందుకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు.వెంకటేష్ మరణాన్ని రాజకీయం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడని , దీనిపై ప్రజలే వాస్తవాలను గమనించాలని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నేరెళ్ల ఘటన హత్యా రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజా పాలన అని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తోందని సంగీతం శ్రీనివాస్ అన్నారు. వెంకటేష్ మరణాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం సరికాదని, ప్రజలు ఈ రాజకీయాలను గమనించాలని అన్నారు. వెంకటేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పెన్షన్తో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా వారికి అందేలా కృషి చేస్తామని జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు