మల్కాపూర్‌కు బస్సు మంజూరు
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి జూన్ 17 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామ ప్రజల కల నెరవేరింది. రవాణా సౌకర్యాలు లేక ఇన్నా ళ్లూ తీవ్ర ఇబ్బందులు పడ్డ ఈ గ్రామ విద్యార్థులు, రైతులు, కార్మికుల ప్రయాణ కష్టాలకు ప్రజా ప్రభుత్వం తీర్చింది.
మల్కాపూర్ గ్రామానికి నూతనంగా కేటాయించిన టీజీఎస్సార్టీసీ బస్సు సర్వీసును చొప్పదండి ని యోజకవర్గ శాసనసభ్యులు, కరీంనగర్ జి ల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ మేడిప ల్లి సత్యం బుధవారం గ్రామంలో పచ్చజెండా ఊపి బస్సు ప్రారంభించారు. ఈ బస్సు కరీంనగర్ నుండి బయలుదేరి వయా మల్కాపూర్, గంగాధర నుండి తిప్పాయిపల్లి మీదుగా వేములవాడ వరకు వెళ్లనుంది. శ్మ హిళలు, సాంప్రదాయబద్ధంగా బస్సుకు పూ జా కార్యక్రమాలు నిర్వహించి, పూలమాలలు, తోరణాలతో అందంగా అలంకరించా రు.
అనంతరం ఎమ్మెల్యే డా. మేడిపల్లి స త్యం చేతిలో ఆర్టీసీ జెండా పట్టి, బస్సును ప్రారంభించారు. ఊరిలోకి బస్సు రావడం చూసి గ్రామస్థులు చప్పట్లతో, హర్షధ్వానాలతో ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృ తజ్ఞతలు తెలియజేశారు.బస్సును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , వేములవాడ డిఎం బోనాల శ్రీనివాస్ బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు కొమ్మనబోయిన సువీన్ యా దవ్ మల్కాపూర్ సర్పంచ్ మడ్లపల్లి తులసి గంగయ్య లతో కలిసి స్వయంగా బస్సు ఎక్కారు ప్రయాణికుల సీట్లలో కూర్చుని గ్రామ ప్రజలతో, మహిళలతో కలిసి ముచ్చటిస్తూ కొంతదూరం ప్రయాణించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాం గ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం గ్రామీణ మహిళల జీవితాలలో ఆర్థిక వెలుగులు నింపిందని కొ నియాడారు. మల్కాపూర్ లాంటి గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు ఇకపై సురక్షితంగా, ఉచితంగా కరీంనగర్, సిరిసిల్ల, వే ములవాడ ప్రాంతాలకు వెళ్లవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డిపో మేనేజర్ బోనాల శ్రీనివాస్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమ్మనబోయిన సువిన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






