సెప్టెంబర్ 17 నుంచి పాదయాత్ర!
బీసీల రాజ్యాధికారమే లక్ష్యం
టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణలో బీసీలను అధికారంలోకి తీసుకురా వడమే లక్ష్యంగా, నిరుద్యోగులు, బీసీలు, అన్యాయానికి గురైన వర్గాలకు అండగా నిలిచేందుకు సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్రవ్యా ప్తంగా పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించిన రోజున ఈ పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు మల్లన్న తెలిపారు.
తెలంగాణలోని ప్రతి గడపను చుట్టి, ప్రజల ఆకాంక్షలను తెలుసుకోవడం, బీసీలకు రాజ్యాధికారం ఎంత ముఖ్యమో ఇంటింటికి వెళ్ళి వారికి తెలియజేస్తూ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాం అని స్పష్టం చేశారు. ఈ పాదయాత్ర ద్వారా బీసీలను ఏకం చేసి, రాబోయే 866 రోజుల్లో తెలంగాణలో బీసీ రాజ్యాధికారాన్ని సాధించడమే తన అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పాలక వర్గాలైన రెడ్డి, వెలమ దొరల 78 ఏండ్ల ఆధిపత్యానికి ముగింపు పలికేలా ఈ పాదయాత్ర ఉంటుందని ఆయన అన్నారు. ‘నన్ను ఆపడం ఎవరి తరమూ కాదు, దమ్ముంటే ఆపుకోండి‘ అని రేవంత్ రెడ్డి, కేసీఆర్ లకు బహిరంగంగా సవాల్ విసిరారు.
బీసీలు, నిరుద్యోగుల ఆకాంక్షలు చట్టాలుగా మారే వరకు ఈ యాత్ర ఆగదని, ఇది రాజకీయ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం కాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాధికారమే లక్ష్యంగా సాగే ఈ యా త్రలో యువత, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, రైతులు, మహిళలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, తమ ఆత్మగౌరవం కోసం గొంతెత్తాలని ఆయన పిలుపునిచ్చారు.
కేంద్రంపై జెన్‌జీ తిరుగుబాటు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యా వ్యవస్థ వైఫల్యాలు మరియు నీట్ పేపర్ లీకేజీలపై, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ దేశ యువత (జెన్-జీ) చేస్తున్న నిరవధిక పోరాటాన్ని కేంద్రం పోలీసు బలగాలతో అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనీసం నోరు విప్పకపోవడం దారుణమని విమర్శించారు.
అమెరికాలో తమ పిల్లలను చదివించుకుంటూ, ఇక్కడి యువత చేతికి మతం రంగు పులిమి రోడ్ల మీదకు బీజేపీ నాయకులు లాగుతున్నారని, ఈ విధానాల వల్ల 2030 తర్వాత దేశంలో బీజేపీ కనుమరుగవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. వాస్తవాలు చూపించాల్సిన జాతీ య మీడియా ‘గోదీ మీడియా‘గా మారిందని, జనం ఆ మీడియాను తీవ్రంగా అస హ్యించుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణలోని స్థానిక మీడియా కూడా యువతను రక్తం వచ్చేలా కొడుతుంటే ఆ వార్తలు చూపించకుండా, పనికిమాలిన వార్తలు, సినీ ప్రముఖుల అప్డేట్స్ ఇస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ చేస్తున్న నిరసనలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, గతంలో కాం గ్రెస్ హయాంలో కూడా 152 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలనలో గ్రూప్-1 పేపర్ లీక్ తో ఎంతోమంది నిరుద్యోగులు బలయ్యారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభు త్వం కూడా యువతను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారే తప్ప నిరుద్యోగులకు న్యాయం జరగలేదన్నారు.






