24 July, 2026 | 12:53 AM

దక్షిణ మధ్య రైల్వేలో మరో మైలురాయి

24-07-2026 12:00 AM
  1. కాజీపేటెేబల్‌హర్ష మార్గంలో మూడో లైన్ నిర్మాణం పూర్తి 
  2. 3 వేల కోట్లు, 203 కిలోమీటర్ల దూరం
  3. రైళ్ల రాకపోకలతో ప్రయాణికులకు మేలు
  4. మరింత వేగంగా సరుకు రవాణా

(బండి సంపత్ కుమార్) 

మహబూబాబాద్, జూలై 23 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే మరో మైలురా యిని అధిగమించింది. కాజీపేట నుంచి బల్‌హర్ష వరకు రూ.3 వేల కోట్ల వ్యయంతో 203 కిలోమీటర్ల మేర మూడవ రైల్వే పనులు బుధవారం పూర్తయ్యాయి. చివరి దశలో ఆసిఫాబాద్ మధ్య 11 కిలోమీటర్ల మేర చేపట్టిన చివరి దశ మూడవ లైన్ నిర్మాణం, విద్యుదీకరణ, బిబ్రా నదిపై నిర్మించిన కీలకమైన వంతెన సహ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

దేశంలోని రైల్వే విభాగంలో ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపే కీలకమైన రైలు మార్గంగా కాజీపేట రైలు మార్గం నిలుస్తోంది. 2020 నుం చి చేపట్టిన మూడవ రైల్వే లైన్ పనుల్లో సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న బల్‌హర్ష వద్ద చిన్న భాగం మినహా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు విద్యుదీకరణ పనులు పూర్తి చేసి సాంకేతిక పరీక్షలు కూడా నిర్వహించి ప్రారంభించారు.

ఇప్పటికే కాజీపేట నుంచి విజయవాడ మార్గంలో1,952 కోట్ల రూపాయలతో చేపట్టిన 219 కిలోమీటర్ల మేర మూడవ లైన్ ని ర్మాణ పనుల్లో 194 కిలోమీటర్ల మేర పను లు విజయవంతంగా పూర్తికాగా, డోర్నకల్ మధ్య మిగిలి ఉన్న 25 కిలోమీటర్ల మూడవ లైన్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి  ఉత్తర దక్షిణాదికి కీలకమైన విజయవాడ, కాజీపేట, బల్ హర్ష రైల్వే కారిడార్ దక్షిణ మధ్య రైల్వే గ్రాండ్ ట్రంక్ రూట్ పూర్తిగా రద్దీ తగ్గిపోనుంది. దక్షిణాది, ఉత్తరాది మధ్య రైళ్ల రాక పోకలకు అంతరాయం తొలగిపోవడంతో పాటు రైళ్ల వేగం మరింత పెరిగి సరుకు రవాణా, ప్రయాణికుల రవాణాకు మరింత కీలకంగా మారనుంది.

మూడవ లైన్‌తో ప్రయోజనాలు

తెలంగాణ, మహారాష్ట్ర రైల్వే రవాణా మౌలిక సదుపాయాలకు గణనీయమైన బలోపేతం కానుంది. దేశంలోని ఉత్తర దక్షిణ ప్రాంతాలను అనుసంధానించే గ్రాండ్ ట్రంక్ మార్గంలో సరుకు, ప్రయాణికుల రవాణా మరింత సజావుగా సాగనుంది. నూతనంగా నిర్మించిన మూడో లైన్ అందుబాటులోకి రావడంతో రైలు రాకపోకల సామర్థ్యం మరింత పెరిగి ప్రజలకు రైల్వే రవాణా అవసరాలు ఆకాంక్షలు మరింత సమర్థవంతంగా నెరవేరనున్నాయి.

రైల్వే ట్రాక్ సమీపంలో సైడింగుల నుంచి బొగ్గు, సిమెంట్, గ్రానైట్, ఇతర సరుకుల రవాణా, విద్యుత్తు కేంద్రాలు, ఇతర పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల రవాణా సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో రద్దీ గణనీయంగా తగ్గ నుంది. ప్రయాణికుల రైలు సేవలు మరింత మెరుగు పడడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు మూడవ రైల్వే లైన్ దోహదపడుతుంది. కాజీపేట మూడవ రైల్వే లైన్ నిర్మాణం విద్యుదీకరణ పనులను విజయవంతంగా పూర్తి చేయడంలో దక్షిణ మ ధ్య రైల్వే నిర్మాణ ఇంజనీరింగ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ ఆపరేటింగ్ ఇతర విభాగాల అధికారులు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ అభినందించారు.