6 July, 2026 | 11:21 AM

దేశంలోనే నంబర్ 1 నగరంగా హైదరాబాద్

06-07-2026 10:29 AM

హైదరాబాద్: దేశంలో మిడిల్ క్లాస్(Middle Class) జనాభా ఎక్కువగా ఉన్న నగరంగా హైదరాబాద్ నంబర్ 1 స్థానం దక్కించుకుంది. ప్రైస్ అండ్ టాటా సన్స్ నివేదిక(Price and Tata Sons Report) సంచలన ప్రకటన చేసింది. కోటీ 20 లక్షల జనాభాతో, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి గ్లోబల్ కంపెనీలతో "మిని ఇండియా"గా పేరున్న హైదరాబాద్‌ మహా నగరంలో మధ్య తరగతి వేగంగా విస్తరిస్తోందని, 2030-31 నాటికి వారి ఆదాయ వాటా మరింత పెరుగుతుందని నివేదిక అంచనా వేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని లక్షల మంది ప్రజలు తమ ఉద్యోగాల కోసం హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు. దీంతో హైదరాబాద్ కు మిని ఇండియాగా గుర్తింపు వచ్చింది. సగటు కుటుంబ ఆదాయంలో బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ టాప్ స్థానాల్లో ఉండగా, ధనవంతుల కేంద్రాలుగా ఢిల్లీ, ముంబై, పుణె ఉన్నాయి. దేశంలోనే టాప్ 100 నగరాలే జాతీయ ఆదాయం, వినియోగంలో మూడో వంతుకుపైగా వాటా కల్గి ఉన్నాయని నివేదిక కీలక విషయాలు వెల్లడించింది.