11 July, 2026 | 5:14 AM

అట్టహాసంగా ప్రారంభమైన పోలీసు క్రీడలు

11-07-2026 01:06 AM

రెండు రోజులపాటు కొనసాగనున్న క్రీడా పోటీలు

కోరుట్ల (జగిత్యాల), జూలై 10 (విజయక్రాంతి): క్రీడలతో స్నేహభావం పొందడంతో పాటు పని ఒత్తిడి నుండి రిలీఫ్ అవడానికి క్రీడ లు ఎంతో దోహదపడుతాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అనునిత్యం విధుల లో, నిరంతరం పనిలో నిమగ్నమైన జిల్లా పోలీసులకు ఆటవిడుపుగా   స్పోరట్స్ ప్రారంభమై నట్లు తెలియజేస్తున్నటువంటి బెలూన్లను గాలి లోకి వదిలి జిల్లా పోలీసు వార్షిక క్రీడలను ప్రారంభించి క్రీడాజ్యోతిని వెలిగించారు. అనంతరం క్రీడాకారులచే ఎలాంటి రాగద్వేషాలు లేకుండా నిష్పక్షపాతంగా క్రీడలను ఆడతామని ప్రతిజ్ఞ చేశారు.

ప్రతిరోజు విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి  ఆటవిడుపుగా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తారని వాటిలో ప్రతి ఒక్కరూ పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందవలసిందిగా తెలిపారు. ఇలాంటి క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగుల మధ్య సఖ్యత పెరిగి, విధులలో కలిసిమెలిసి పనిచేస్తూ ఉండడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, రాములు, ఇన్స్పెక్టర్లు ఆరిఫ్ అలీఖాన్, సుధాకర్, కరుణాకర్, రాజకుమార్, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, సైదులు, వేణు, ఎస్.ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.