28 February, 2026 | 5:42 PM

కేజీబీవీ పాఠశాలలో పోలీసు అక్క

28-02-2026 03:33 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు మహిళా పోలీసులు పోలీసు అక్క కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చదువుపై అవగాహన, ప్రతిరోజు వ్యాయామాలు పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు. సైబర్ నేరాల పట్ల తల్లిదండ్రులను అప్రమత్తం చేయడం. సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గించడం. వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయమే పాఠశాలలకు వెళ్లిన పోలీస్ సిబ్బంది వారితో కలిసి ఆటపాట కార్యక్రమం లో ఉత్సాహంగా పాల్గొన్నారు