100కి పైగా లొకేషన్లలో ఐ యామ్ గేమ్
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఐ యామ్ గేమ్’. వే ఫారర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్‌సల్మాన్, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షహబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ కథా రచన అందించారు. ఈ చిత్రంలో ఆంటోని వర్గీస్, మైస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దక్షిణాదిన 100కి పైగా లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
తాజాగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇదే అత్యంత స్టైలిష్ ఫిల్మ్ అని తెలిపారు. నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టులో మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ స్టంట్ డ్యుయో అన్బరివ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు.






