8 April, 2026 | 10:18 PM

మహిళా ప్రాణాలు కాపాడిన పోలీసులు

08-04-2026 08:28 PM

కుబీర్,(విజయక్రాంతి): బాసర మండల కేంద్రంలో గోదావరి బ్రిడ్జి పై దూకి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన ఓ మహిళా ప్రాణాలను నారి శక్తి పోలీసులు బుధవారం కాపాడారు. నిజాంబాద్ జిల్లా చెందిన ఓ మహిళ భర్తతో గొడవపడి బాసరకు వచ్చింది. గోదావరి వద్ద బస్సు దిగి విడిచి పైకి ఒంటరిగా వెళ్తున్న మహిళను అక్కడ విధులు నిర్వహిస్తున్న నారిశక్తి పోలీసులు అనుసరించారు. ఆమెను పట్టుకొని విచారించగా తను ఆత్మహత్య చేసుకుంటారని చెప్పగా కౌన్సిలింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు బాసర పోలీసులు తెలిపారు.