8 April, 2026 | 9:52 PM

మెల్లకుంట తండాలో ఎఫ్‌ఎండీ టీకా కార్యక్రమం

08-04-2026 08:24 PM

డాక్టర్ రవి కుమార్

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మెల్లకుంట తండా గ్రామంలో బుధవారం పశువులకు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (ఎఫ్‌ఎండీ) టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని మండల పశు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ... మెల్లకుంట తండా గ్రామంలో 165 ఎద్దులకు, 86 గేదెలకు టీకాలు వేసినట్లు మండల పశు వైద్యాధికారి రవి కుమార్ తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరు పశువులకు ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెల్లకుంట తండా సర్పంచ్ బాల్య నాయక్,ఉప సర్పంచ్ రామావత్ వాసురం,పశు వైద్యాధికారి రవికుమార్, సిబ్బంది విజయ,జయరాజ్, గంగారామ్ తదితరులు పాల్గొన్నారు.