పేకాట స్థావరంపై పోలీసుల దాడి..
27-05-2026 01:34 AM
గాంధారి, మే 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పోతంగల్ గ్రామ పరిధిలో రహస్య పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పోతంగల్ గ్రామ పరిధిలో అటవీ ప్రాంతంలో రహస్యంగా కొందరు పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు స్థానిక ఎస్‌ఐ మహేందర్ ఆధ్వర్యంలో మెరుపు దాడి చేసినట్టు తెలిపారు. పేకాట ఆడుతున్న అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.. వారి వద్ద నుండి రూ.48,100 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.






