27 May, 2026 | 3:23 AM

ఆర్‌డీఓ వెంకటేష్ సేవలు అమోఘం

27-05-2026 02:07 AM

ములుగు (మహబూబాబాద్) మే 26 (విజయక్రాంతి): ములుగు జిల్లా అభివృద్ధిలో ఆర్డిఓ వెంకటేష్ సేవలు ప్రశంసనీయమని, ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతానికి ఆయన చేసిన కృషి అమోఘమని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు అన్నారు. ములుగు జిల్లా ఆర్డీవోగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న వెంకటేష్ కు ఆత్మీయ వీడుకోలు పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తే సమావేశంలో ములుగు జిల్లా అభివృద్ధిలో ఆర్డీవో వెంకటేష్ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారని అభినందించారు. ఈ సందర్భంగా వెంకటేష్ ను అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, ఇంచార్జ్ ఆర్డిఓ ప్రతాప్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు మండల తహసిల్దారులు, ఎంపీడీవోలు, ఉద్యోగులు పాల్గొన్నారు.