27 May, 2026 | 2:06 AM

శంషాబాద్‌లో భూం 170 ఎకరాలకు స్కెచ్

27-05-2026 01:19 AM

ప్రభుత్వ భూమి, పట్టా ఎలా అయ్యింది?

  1. ఆర్డీవో, తహసీల్దార్ వేర్వేరు రిపోర్టులు
  2. ఆర్డీవోను కాదని తహసీల్దార్ ప్రైవేటు భూమి అని ఎలా డిసైడ్ చేస్తారు
  3. ఈ కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు?
  4. సిట్ వేసి, విచారణ జరిపించాలి 
  5. డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి) : శంషాబాద్ మండలం పెద్దషాపూర్‌లో 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే కుట్ర జరిగిందని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఆ భూమి ప్రభు త్వ భూమి అని.. దాన్ని ఆక్రమణకు గురికాకుండా ఉం డాలని ఆర్డీవో.. తహసీల్దార్‌కు చెప్పారు. అంతేకాదు ప్రొహిబిటరీ లిస్టు 22ఏలో పెట్టాలని ఆదేశించారు.

ఇదే విషయం జనవరి 30, 2026 నాడు హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఇది ప్రభుత్వ భూమి అని ఫిబ్రవరి 24, 2026 నాడు తహశీల్దార్ తేల్చారు. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 28, 2026 నాడు ఈ భూమి ప్రైవే టు వ్యక్తులకు చెందుతుందని తహశీల్దార్ ఆర్డ ర్ పాస్ చేసిండు. ఈ నాలుగు రోజుల్లోనే ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి ఎలా అయ్యింది’ అని హరీష్‌రావు నిలదీశారు. అం తే కాదు ఈ భూమిని భూ భారతి ఆన్‌లైన్‌లో కూడా పెట్టారని తెలిపారు.

‘ఆర్డీవో, తహశీల్దా ర్ ఇద్దరు భిన్నంగా ఇస్తే జీపీ రెవెన్యూ హైకోర్టుకు ఎలా ఇచ్చారు. ఏ ఆర్డర్ అయినా కలెక్టర్ అఫ్రూవల్‌తో హైకోర్టుకు వెళ్తుంది, కలెక్టర్ ఎలా అఫ్రూవల్ చేసారు. అడ్వకేట్ జనరల్ ఏరకంగా అఫ్రూవల్ చేసారు. రూ.వెయ్యి కోట్ల విలువైన భూములు. ఇంత పెద్ద స్కాం జరిగితే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ స్కాం గురించి పత్రికల్లో వస్తే, ఈ కేసులో కేవలం ఎమ్మార్వోను కలెక్టరేట్‌కు బదిలీచేసి ఊరుకున్నరు. ఏసీబీ అధికారులు రైడ్ వెళ్లారు.

ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పారో ఏసీబీ వాపస్ వచ్చింది. తహసీల్దార్‌ను చిన్న బదిలీతో సరిపెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డికి సంబం ధించిన అతి సన్నిహితుడు ఇందులో ఉన్నడు కాబట్టే ఏసీబీ వెనక్కి వచ్చింది. ఒత్తిడి కారణంగానే ఎమ్మార్వోను జస్ట్ ట్రాన్ఫర్ చేసారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మార్వో ను కాపాడటంలో ఉన్న పెద్దలు ఎవరు? వారు బయటకు రావాలి’ అని హరీష్‌రావు డిమాం డ్ చేశారు.

భూ భారతిలో భూమి చేరాలంటే.. దరఖాస్తు పెట్టాలి, ఆర్డీవో దాన్ని అప్రూవ్ చేయాలని భూభారతి చట్టం చెబుతుందని, కానీ ఎమ్మార్వో భూ భారతిలో పెట్టాలని చెప్పగానే అది భూ భారతిలో ఎంట్రీ అయిపోయిం ది’ అని హరీష్‌రావు చెప్పారు. 170 ఎకరాలు ప్రభుత్వ భూమి పట్టా అని ఎలా ఎక్కించారని ఆయన మండిపడ్డారు. ఎమ్మార్వోను కేవలం ట్రాన్ఫర్ చేసి భూమి మ్యుటేషన్ చేసుకున్నారని, ఆ  భూమిని ఎందుకు తీసుకోలేదని, నిషే ధిత జాబితాలో ఎందుకు చేర్చలేదని, టోటల్ పట్టా భూమిగా 170 ఎకరాలు మార్చుకున్నారని తెలిపారు.

ఈ వ్యవహారంలో ఎమ్మార్వో ను సస్పెండ్ చేసి సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు ఆర్డర్ మీద ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లి.. ఆ భూమిని తిరిగి నిషేధిత జాబితాలో పెట్టాలన్నారు’. ఈ విషయంలో కలెక్టర్, సీసీఎల్‌ఏ అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారా? ఆరా తీయాలని,  ప్రభుత్వ పెద్దలు కూడా బయటకు రావాలన్నారు. మీది నిజంగా ప్రజాపాలన అయితే, ఈ భూ కుంభకోణంలో భాగస్వామ్యం లేకపోతే, తప్పు చేయకపోతే మీ ప్రమేయం లేకపోతే తహశీల్దార్‌ను వెంటనే డిస్మిస్ చేయండి, ప్రభుత్వ భూమిని కాపాడండి’ అని హరీష్‌రావు కోరారు. 

ఆర్టీసీ డ్రైవర్‌ను సస్పెండ్‌ను ఎత్తివేయాలి  

జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై సస్పెన్షన్ వేటువేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని హరీష్‌రావు అన్నారు. ఆయన డ్రైవర్ కావొచ్చు, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ అని, రైతుల కష్టాలు చూడలేక  ధాన్యం కొనుగోలు చేయాలని మాట్లాడితే తప్పు ఎలా అవుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్చ ఉంటుందని, రాజ్యంగం ఇచ్చిన హక్కులను కాలరా స్తారా? అని హరీష్‌రావు మండిపడ్డారు.

ప్రశ్నించే హక్కు ఆరో గ్యారెంటీ అన్న మీకు.. ఇంత నియంతృత్వ వైఖరి ఎందుకని, సస్పెన్షన్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌కు అండగా బీఆర్‌ఎస్ ఉంటుందని, న్యాయపోరాటం, ప్రత్యక్ష పోరాటానికి సిద్ధ్దమన్నారు.