27 May, 2026 | 3:23 AM

పీవీ విజ్ఞాన కేంద్రం పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

27-05-2026 02:07 AM
  1. జూన్ 28 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి
  2. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
  3. వంగరలో ఫొటో మ్యూజియాన్ని పరిశీలించిన కలెక్టర్

భీమదేవరపల్లి, మే 26 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండ లం వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేం ద్రం అభివృద్ధి పనులను వేగవంతంగా పూ ర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం మా జీ ప్రధానమంత్రి దివంగత పాములపర్తి వెంకట నరసింహారావు స్వగ్రామమైన వంగరలో నిర్మాణంలో ఉన్న పీవీ విజ్ఞాన కేంద్రా న్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా పీవీ స్ఫూర్తి వనంలోని ఫోటో గ్యాల రీ, సైన్స్ మ్యూజియం, సమావేశ మందిరాన్ని సందర్శించిన కలెక్టర్, అసంపూర్తిగా ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని పర్యాటక శాఖ, కుడా అధికారులకు సూచించారు. తాగునీటి పైపులైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 28 నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. అనంతరం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగృహంలో ఏర్పాటు చేస్తున్న ఫోటో మ్యూజి యాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.

పీవీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో జాతీయ, అంతర్జాతీయ ప్ర ముఖులతో దిగిన అరుదైన ఫోటోలను కుటుంబసభ్యులతో కలిసి పరిశీలించారు. వివిధ సందర్భాల్లో దిగిన ఫోటోల ప్రాముఖ్యతను పీవీ కుటుంబసభ్యులు పీవీ ప్రభా కర్ రావు, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, పీవీ మదన్ మోహన్ కలెక్టర్‌కు వివరించారు. వివిధ దేశాల నుంచి పీవీ నరసింహారావుకు లభించిన పురస్కారాలు, ఆయన రచించిన పుస్తకాలను కలెక్టర్ పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ రాజేష్, పర్యాటక శాఖ డీఈ ధనరాజ్, ఏఈ కీర్తి తదితరులు పాల్గొన్నారు.