27 May, 2026 | 2:23 AM

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

27-05-2026 01:32 AM

గాంధారి, మే 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పోతంగల్ కలాన్ వద్ద గత నెల 18వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి గాదం బాలయ్య అనే వ్యక్తి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.

స్థానిక ఎస్‌ఐ మహేందర్ వివరాల ప్రకారం గత నెలలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టిన ఘటనలో బాన్సువాడ నుండి గాంధారి వస్తున్న గాదం సుధాకర్, బాలయ్యలు ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టడంతో గాదం బాలయ్య తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు తెలిపారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్‌ఐ మహేందర్ తెలిపారు.