27 May, 2026 | 2:24 AM

బాల్యవివాహాలను నిషేధించాలి..

27-05-2026 01:36 AM

తాడ్వాయి మే 26 (విజయక్రాంతి): బాల్య వివాహాలను నిషేధించాలని మహిళా సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ లో మంగళవారం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బాల్యవివాహాల నిషేధం పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ... బాల్య వివాహాలను ఎవరు ప్రోత్సహించవద్దన్నారు. ఎర్ర పహాడ్ గ్రామంలో గత రెండు సంవత్సరాల నుంచి బాల్య వివాహాలు జరగలేదని తెలిపారు. పిల్లలను రక్షించి, పిల్లలకు చదువు అందిస్తే దేశ ప్రగతి మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లవ్వ, ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,వార్డు సభ్యులు, కార్యదర్శి నవీన్ కుమార్, గ్రామపంచాయతీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.