22 May, 2026 | 8:50 PM

Breaking News

భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •   ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •  

ఫేక్ కరెన్సీ ముఠాపై పోలీసుల ఉక్కుపాదం.. ముగ్గురు అరెస్ట్

24-11-2025 12:00 AM

కామారెడ్డి, నవంబర్ 23(విజయ క్రాంతి): అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా సభ్యుల్లో మరో ముగ్గురు సభ్యులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదివారం వెల్లడించారు. నకిలీ నోట్ల ముఠా సభ్యుల్లో మరి కొంతమంది తప్పించుకొని తిరుగుతుండగా ఛత్తీస్ గఢ్ లో మరో ముగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి 1,70,500 ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అంతర్రాష్ట్ర ఫేక్ కరెన్సీ నోట్ల తయారీ ముఠా పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ కేసులో పోలీసులు గతంలో ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గాలింపు చేపట్టి ఫేకు నోట్ల ముఠా లోని 8 మంది నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇందులో ప్రధాన నిందితుడు అయిన కరెన్సీ కాట్నీపై ఇటీవల పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. తాజాగా ఈ ముఠాలోని మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.