శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్
22-05-2026 08:41 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన అంగోతు గోపి ఎన్సిఎల్ ఫ్యాక్టరీలో ప్రయివేట్ జాబ్ చేస్తున్నాడు, ఇతను ఆ గ్రామంలో రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టినందుకు శుక్రవారం తాహశీల్దార్ ముందు 1 సంవత్సరం,5 లక్షల స్వంత పూచికత్ పైన బైoడోవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై బి.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎవరు అయినా అనవసరంగా సోషల్ మీడియా లో పోస్టులు పెడితే చట్ట ప్రకారం గా చర్యలు తీసుకోబడుతాయని తెలిపారు.






